నిఫ్టీపై బేరిష్ వ్యూహం
HDFC సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ నందిష్ షా, నిఫ్టీ ఇండెక్స్ పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. దీనికోసం మే 26 ఎక్స్‌పైరీ ఆప్షన్స్‌తో బేరిష్ స్ప్రెడ్ ను సూచించారు. ఇందులో భాగంగా 23,600 పుట్ ఆప్షన్ ను కొనుగోలు చేసి, 23,400 పుట్ ఆప్షన్ ను అమ్మాలని సూచించారు. ఈ ట్రేడ్ లో గరిష్ట నష్టం ₹4,940 కి పరిమితం కాగా, ఎక్స్‌పైరీ నాటికి నిఫ్టీ 23,400 లేదా అంతకంటే తక్కువకు ముగిస్తే గరిష్ట లాభం ₹8,060 వస్తుంది. బ్రేక్ఈవెన్ పాయింట్ 23,524 వద్ద ఉంది, రిస్క్-రివార్డ్ రేషియో 1:1.63 గా ఉంది. నిఫ్టీ ఫ్యూచర్స్ లో షార్ట్ బిల్డప్, పుట్-కాల్ రేషియో 1.24 నుంచి 1 కి పడిపోవడం, ఇండెక్స్ 200 రోజుల EMA కంటే కింద ట్రేడ్ అవ్వడం వంటి కారణాలతో షా ఈ బేరిష్ వ్యూహాన్ని సిఫార్సు చేశారు.
