అత్యున్నత క్రెడిట్ రేటింగ్ అంటే?
CARE రేటింగ్స్ ఇచ్చిన ఈ 'AAA' రేటింగ్, Shriram Finance అప్పులను తిరిగి చెల్లించడంలో ఎలాంటి ప్రమాదం లేదని (Low Credit Risk) చెబుతోంది. బ్యాంక్ ఫెసిలిటీస్ తో పాటు, కంపెనీ జారీ చేసే నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లకు (NCDs) కూడా ఈ రేటింగ్ దక్కింది.
ఆర్థికంగా మరింత పటిష్టం..
'Stable' ఔట్‌లుక్ అంటే, భవిష్యత్తులో కంపెనీ ఆర్థిక పనితీరులో పెద్దగా మార్పులు ఉండవని, స్థిరంగా కొనసాగుతుందని అర్ధం. దీనివల్ల, Shriram Finance కి అప్పులు తెచ్చుకోవడం (Borrowing) మరింత సులభతరం అవుతుంది. వడ్డీ రేట్లు కూడా తగ్గే అవకాశం ఉంది. అలాగే, ఇన్వెస్టర్లలో కంపెనీపై నమ్మకం (Investor Confidence) మరింత పెరుగుతుంది.