ఇంతకీ ఈ మార్పు ఎందుకు?
పెట్టుబడుల విలువలో వచ్చే ఒడిదుడుకుల నుంచి బ్యాంకులకు అదనపు రక్షణ కల్పించేందుకు IFR ను ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ప్రస్తుత మార్కెట్ ధరల వద్ద విలువ కట్టే పెట్టుబడులకు ఇది ఒక భద్రతా వలయంలా పనిచేసేది. అయితే, ఇప్పుడు మార్కెట్ రిస్క్ మేనేజ్‌మెంట్, పోర్ట్‌ఫోలియో నిర్వహణపై కొత్త రూల్స్ వస్తుండటంతో, RBI ఈ తప్పనిసరి IFR ను నిలిపివేయాలని నిర్ణయించింది.
మరి IFR లోని నిధులెక్కడికి?
IFR రద్దు తర్వాత, మే 17, 2026 నాటికి అందులో ఉన్న నిల్వలను స్టాట్యూటరీ రిజర్వ్‌లు, జనరల్ రిజర్వ్‌లకు లేదా లాభనష్టాల ఖాతా (Profit and Loss Account) లోకి బదిలీ చేస్తారు. విదేశీ బ్యాంకులకు సంబంధించి, వాటి ఇండియా బ్రాంచ్‌లలోని IFR బ్యాలెన్స్‌ను స్టాట్యూటరీ రిజర్వ్‌లలోకి లేదా ఇండియాలోనే నిలిపి ఉంచాల్సిన లాభాల్లోకి మళ్లిస్తారు.
ఇతర బ్యాంకులపై ప్రభావం?
సహకార బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (SFBs), పేమెంట్స్ బ్యాంకుల (PBs) కు మాత్రం వేరే నిబంధనలు వర్తిస్తాయి. SFBs, PBs విషయంలో, ఇతర కేటాయింపులన్నీ పూర్తయ్యాక వచ్చే నికర లాభం (Net Profit) నుంచే IFR బదిలీలు జరగాలని తుది నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నియంత్రణ మార్పుతో, బ్యాంకులు తమ క్యాపిటల్, రిజర్వ్‌లను నిర్వహించుకోవడంలో మరింత వెసులుబాటు లభించనుంది.