అద్దె ఇల్లు కాదు.. ఇక సొంత ఇల్లే!
ఇప్పటిదాకా PhonePe తన కార్యకలాపాల కోసం క్లౌడ్ సర్వీసులను అద్దెకు (Renting) తీసుకునేది. కానీ కంపెనీ సైజ్ పెరిగేకొద్దీ ఆ 'అద్దె' భారం తడిసి మోపెడవుతోంది. అందుకే సొంత డేటా సెంటర్లు, హార్డ్‌వేర్ పెట్టుకోవడం ద్వారా ఒక్కో ట్రాన్సాక్షన్ ఖర్చును కేవలం Rs 0.06 కి తగ్గించుకోవాలని టార్గెట్ గా పెట్టుకుంది. లాంగ్ రన్ లో ఇది కంపెనీకి భారీగా లాభాలను మిగిల్చే అవకాశం ఉంది.
స్పీడ్ ముఖ్యం బిగులు (Speed & Security)
పేమెంట్స్, లోన్స్ బిజినెస్‌లో స్పీడ్ చాలా కీలకం. సొంత టెక్నాలజీ ఉండటం వల్ల పేమెంట్స్ మిల్లీసెకన్లలో (Ultra-low latency) పూర్తవుతాయి. అంతేకాకుండా, మన డేటా వేరే దేశపు సర్వర్లలో కాకుండా, ఇండియాలోనే సెక్యూర్ గా ఉంటుంది. ఇది RBI నిబంధనలకు (Data Sovereignty) అనుగుణంగా ఉండటంతో రెగ్యులేటరీ సమస్యలు కూడా తగ్గుతాయి.
ఐపీఓ (IPO) చూపు..
ఇంత భారీగా ఖర్చు పెడుతున్నా కూడా, కంపెనీ FY25 నాటికి ఫ్రీ క్యాష్ ఫ్లో పాజిటివ్ (FCF Positive) గా నిలిచింది. ఇన్వెస్టర్లు ఎప్పుడూ లాంగ్ టర్మ్ విజన్ ఉన్న కంపెనీలనే ఇష్టపడతారు. రాబోయే IPO సమయానికి.. సొంత టెక్నాలజీ ఉన్న బలమైన కంపెనీగా PhonePe మార్కెట్ లో నిలబడనుంది.