ఇన్‌కమ్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ITAT) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. NRIల టాక్స్ రెసిడెన్సీని లెక్కించేటప్పుడు, వారు ఇండియాకు చేరుకున్న రోజును (Arrival Day) మొత్తం రోజుల్లో కలపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ రూలింగ్ వల్ల NRIలకు పన్ను భారం తగ్గనుంది.
ట్యాక్స్ రెసిడెన్సీ లెక్కల్లో క్లారిటీ
ఢిల్లీకి చెందిన ఇన్‌కమ్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ITAT) ఇచ్చిన ఈ తీర్పు NRIలకు పెద్ద ఊరట. సాధారణంగా ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ ప్రకారం, ఒక వ్యక్తి ఫైనాన్షియల్ ఇయర్‌లో 182 రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఇండియాలో ఉంటే, వారిని 'రెసిడెంట్'గా పరిగణిస్తారు. గతంలో టాక్స్ అధికారులు వచ్చే రోజు, వెళ్ళే రోజు రెండింటినీ కలిపి లెక్కించడంతో చాలామంది NRIలు అనుకోకుండా రెసిడెంట్ కేటగిరీలోకి వచ్చేసేవారు.
డబుల్ కౌంటింగ్‌కు చెక్
జనరల్ క్లాజెస్ యాక్ట్ సూత్రాలను అమలు చేస్తూ, కాలపరిమితిని లెక్కించేటప్పుడు ప్రారంభ రోజును పరిగణనలోకి తీసుకోకూడదని ITAT స్పష్టం చేసింది. దీనివల్ల frequentగా ప్రయాణించే NRIల స్టే కౌంట్ తగ్గుతుంది. ఇది పన్ను బాధ్యతలను నిర్ణయించడంలో కీలకం కానుంది.
నిపుణుల సూచనలు
ఇది జ్యుడీషియల్ తీర్పు మాత్రమేనని, పన్ను శాఖ ఏ సమయంలోనైనా వివరాలను పరిశీలించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి NRIలు ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలి:
- ట్రావెల్ లాగ్స్: పాస్‌పోర్ట్ ఎంట్రీ/ఎగ్జిట్ స్టాంపులు, బోర్డింగ్ పాస్‌లు మరియు టికెట్లను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి.
- పత్రాల భద్రత: కేవలం రోజుల లెక్కే కాకుండా, విదేశీ ఉపాధి ఒప్పందాలు, జీతభత్యాల స్టేట్‌మెంట్లు మరియు వర్క్ పర్మిట్‌లను సిద్ధంగా ఉంచుకోవాలి.
- ఆర్థిక సంబంధాలు: పన్ను నివాస హోదా కేవలం రోజులపైనే కాకుండా, ఇండియాలో ఉండే ఆర్థిక సంబంధాలపై కూడా ఆధారపడి ఉంటుందని గుర్తించుకోవాలి.
