Karnataka State Consumer Commission తాజాగా ఇచ్చిన తీర్పు బ్యాంకింగ్ రంగంలో సంచలనం రేపింది. Canara Bank లో తాకట్టు పెట్టిన బంగారు నగలు పోతే, కేవలం బంగారం బరువుకే కాకుండా, మేకింగ్ ఛార్జీలు మరియు రాళ్ల విలువను కూడా కలిపి చెల్లించాలని కమిషన్ స్పష్టం చేసింది.
కర్ణాటక రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఇచ్చిన ఈ తీర్పు బ్యాంకుల బాధ్యతను పెంచింది. తుముకూరుకు చెందిన ఒక కస్టమర్ తన నగలను బ్యాంకులో తాకట్టు పెట్టగా, అవి చోరీకి గురయ్యాయి. అప్పుడు బ్యాంకు కేవలం బంగారం బరువును మాత్రమే లెక్కించి పరిహారం ఇస్తామని చెప్పింది. కానీ, మేకింగ్ ఛార్జీలు మరియు జ్యువెలరీలో ఉండే రాళ్ల విలువను కూడా చెల్లించాల్సిందేనని కమిషన్ తేల్చి చెప్పింది.
ఇన్వెస్టర్లకు హెచ్చరిక
ఈ తీర్పు ద్వారా బ్యాంకులు కేవలం నగదుకు కాకుండా, ఆ ఆస్తికి ఉన్న మొత్తం 'మార్కెట్ వాల్యూ'కి బాధ్యత వహించాల్సి ఉంటుంది. గతంలో RBI గోల్డ్ లోన్లకు సంబంధించి పారదర్శకత, భద్రత మరియు ఆడిట్ ప్రక్రియలపై కఠినమైన నిబంధనలు తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ కోర్టు తీర్పు కూడా తోడవడంతో, బ్యాంకులు సెక్యూరిటీ వ్యవస్థలు, వాల్ట్ ఆడిట్స్ మరియు ఇన్సూరెన్స్ కోసం మరిన్ని నిధులను వెచ్చించాల్సిన అవసరం ఏర్పడింది.
ప్రభావం ఎలా ఉండబోతోంది?
మహారాష్ట్రలో జరిగిన గోల్డ్ ఫ్రాడ్ వంటి ఘటనల తర్వాత, ఇప్పటికే బ్యాంకులపై ఒత్తిడి ఉంది. ఇప్పుడు ఈ లీగల్ ప్రెసిడెంట్ (Legal Precedent) వల్ల భవిష్యత్తులో గోల్డ్ లోన్ సెగ్మెంట్‌లో బ్యాంకుల నిర్వహణ ఖర్చులు (Operating Expenses) పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, ఇన్వెస్టర్లు బ్యాంకుల గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో, సెక్యూరిటీ ప్రోటోకాల్స్ మరియు ఆడిట్ రిపోర్టులను నిశితంగా గమనించడం అవసరం.
