Airtel Payments Bank, ఆర్థిక సంవత్సరం 2026 (FY26)కి సంబంధించిన అద్భుతమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ కాలంలో నికర లాభం 73% పెరిగి ₹109 కోట్లకు చేరుకుంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో నమోదైన ₹63 కోట్ల లాభంతో పోలిస్తే చెప్పుకోదగ్గ వృద్ధి. అదేవిధంగా, బ్యాంక్ ఆదాయం కూడా ₹2,709 కోట్ల నుంచి ₹3,207 కోట్లకు పెరిగింది.
డిజిటల్ సేవల జోరు
బ్యాంక్ కస్టమర్ బ్యాలెన్సులు ఏకంగా 26% పెరిగి ₹4,612 కోట్లకు చేరుకోవడం విశేషం. పట్టణ ప్రాంతాల్లో 'సేఫ్ సెకండ్ అకౌంట్' (Safe Second Account) కు పెరుగుతున్న ఆదరణ దీనికి ఒక కారణం. రోజువారీ డిజిటల్ లావాదేవీలు, రికరింగ్ పేమెంట్స్ కోసం కస్టమర్లు Airtel Payments Bankను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. దీనివల్ల బ్యాంక్ డిజిటల్ పేమెంట్స్ రంగంలో కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా, UPI ఆటోపే మండేట్స్ (UPI Autopay Mandates) అందించడంలో రెండో అతిపెద్ద సంస్థగా అవతరించింది.
