ట్రాక్టర్ల అమ్మకాలతో జోరు
కంపెనీ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ విభాగం ఈ అమ్మకాల వృద్ధిలో కీలక పాత్ర పోషించింది. మొత్తం ట్రాక్టర్ల అమ్మకాలు 48,411 యూనిట్లకు చేరుకున్నాయి. ఇది గత సంవత్సరం ఏప్రిల్‌తో పోలిస్తే 21% అధికం. ఫార్మ్ ఎక్విప్‌మెంట్ బిజినెస్ ప్రెసిడెంట్ వీజే నక్రా మాట్లాడుతూ, ఈసారి ఏప్రిల్‌లో గత సంవత్సరంలా చైత్ర నవరాత్రి పండుగ సీజన్ లేకపోయినా, అమ్మకాలు బలంగా ఉండటం విశేషమని తెలిపారు. ట్రాక్టర్ల ఎగుమతులు కూడా 30% పెరిగి 2,007 యూనిట్లకు చేరాయి.
ప్యాసింజర్, కమర్షియల్ వాహనాలూ ఆకట్టుకున్నాయ్
ఆటోమోటివ్ డివిజన్ కూడా మెరుగైన పనితీరు కనబరిచింది. డొమెస్టిక్ ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు 8% పెరిగి 56,331 యూనిట్లకు చేరుకున్నాయి. దేశీయ మార్కెట్లో 23,427 కమర్షియల్ వాహనాలను కూడా కంపెనీ విక్రయించింది. ఆటోమోటివ్ డివిజన్ సీఈఓ నళీనికాంత్ గోళ్ళగుంట మాట్లాడుతూ, కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27ను ఏప్రిల్‌లో మంచి జోష్‌తో ప్రారంభించామని తెలిపారు.
