ఇన్ క్రెడ్ రీసెర్చ్ (Incred Research) విశ్లేషణ ప్రకారం, భారతదేశ ఆటోమొబైల్ రంగం రాబోయే రెండు నుండి మూడు సంవత్సరాలలో బలమైన డిమాండ్ రికవరీని చూసే అవకాశం ఉంది. కొన్ని వాహనాలపై GST తగ్గింపులు, ఆదాయపు పన్ను తగ్గింపులు, వడ్డీ రేట్ల తగ్గింపులు, మరియు 8వ సెంట్రల్ పే కమీషన్ నుండి జీతాల సవరణలు వంటి ముఖ్యమైన పాలసీ చర్యలు వినియోగదారుల ఆదాయాన్ని పెంచి, ఖర్చులను తగ్గించగలవని అంచనా. ఇటీవలి స్థబ్ధత తర్వాత కూడా, ఈ రంగం యొక్క ఔట్ లుక్ సానుకూలంగా ఉంది, ఇన్ క్రెడ్ రీసెర్చ్ "ఓవర్ వెయిట్" (Overweight) రేటింగ్ ను పునరుద్ఘాటించింది.