దేశీయ మార్కెట్లో టాప్ ప్లేయర్స్
Mahindra & Mahindra (M&M) కంపెనీ తమ SUV అమ్మకాలను గత ఏడాదితో పోలిస్తే 25% పెంచుకుని, నెలలో మొత్తం 63,510 SUV యూనిట్లను విక్రయించింది. M&M ఆటోమోటివ్ డివిజన్ CEO నళినీకాంత్ గోళ్ళగుంట మాట్లాడుతూ, ఈ సంవత్సరం (2026) ప్రారంభం చాలా బాగుందని, జనవరి 14న XUV7XO మరియు XEV 9S మోడల్స్ బుకింగ్స్ కేవలం 4 గంటల్లోనే 93,689 యూనిట్లు చేరి, ₹20,500 కోట్ల విలువైన బుకింగ్స్ రావడం రికార్డు అని తెలిపారు.
ఇక Hyundai Motor India అమ్మకాలు 9.5% పెరిగి, 59,107 యూనిట్లకు చేరుకున్నాయి. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధిక నెలవారీ అమ్మకాలు. జనవరి 1, 2026 నుంచి కొత్త MD & CEO గా తరుణ్ గార్గ్ బాధ్యతలు చేపట్టారు.
Toyota Kirloskar Motor (TKM) అమ్మకాలు 17% పెరిగి, 30,630 యూనిట్లకు చేరుకున్నాయి. 2026కి ఇది చాలా పాజిటివ్ ఆరంభమని TKM ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సబరి మనోహర్ తెలిపారు.
టూ-వీలర్లకూ డిమాండ్ బలంగానే
టూ-వీలర్ల విభాగంలో కూడా అమ్మకాలు పుంజుకున్నాయి. TVS Motor Company అమ్మకాలు 30% పెరిగి, 383,262 యూనిట్లకు చేరాయి. Royal Enfield అమ్మకాలు 16% పెరిగి, 93,781 యూనిట్లుగా నమోదయ్యాయి. గత నాలుగు నెలలుగా ఈ కంపెనీ నిలకడగా డబుల్ డిజిట్ వృద్ధిని చూపిస్తోందని Eicher Motors MD, Royal Enfield CEO బీ. గోవిందరాజన్ తెలిపారు.
కమర్షియల్ వెహికల్స్, వ్యవసాయ రంగం కూడా జోష్ లో
Tata Motors కమర్షియల్ వెహికల్స్ అమ్మకాలు 29.15% పెరిగి, 38,844 యూనిట్లకు చేరాయి. Eicher బ్రాండ్ ట్రక్కులు, బస్సుల అమ్మకాలు 23.6% పెరిగి, జనవరిలో 9,729 యూనిట్లుగా నమోదయ్యాయి.
వ్యవసాయ రంగంలో, Mahindra tractors అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 46% పెరిగి, జనవరి 2026 లో 38,484 యూనిట్లుగా నమోదయ్యాయి. నీటి నిల్వలు పుష్కలంగా ఉండటం, ప్రభుత్వ మద్దతు వ్యవసాయం, ట్రాక్టర్ల వాడకానికి ఊతమిస్తున్నాయని Mahindra & Mahindra ఫార్మ్ ఎక్విప్‌మెంట్ బిజినెస్ ప్రెసిడెంట్ వీజే నక్రాలు ఆశాభావం వ్యక్తం చేశారు.