Coca-Cola తన భారతీయ బాట్లింగ్ వ్యాపారాన్ని 2027 నాటికి సుమారు ₹8,300 కోట్లతో (1 బిలియన్ డాలర్లు) IPO ద్వారా లిస్ట్ చేయాలని యోచిస్తోంది. ఈ నిర్ణయం భారతదేశంలో FMCG రంగంలో ఒక కీలక పరిణామంగా మారింది.
అసలేం జరగబోతోంది?
ప్రపంచ ప్రఖ్యాత బెవరేజ్ సంస్థ Coca-Cola Co. తన భారతీయ బాట్లింగ్ కార్యకలాపాలను 2027 నాటికి పబ్లిక్‌గా లిస్ట్ చేయాలని అధికారికంగా ప్రకటించింది. సంస్థ తన భారతీయ అనుబంధ సంస్థ, Hindustan Coca-Cola Holdings (HCCH) ద్వారా ఈ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ను తీసుకురావాలని భావిస్తోంది. HCCH అనేది భారతదేశంలో అతిపెద్ద లోకల్ బాట్ట్లర్ అయిన Hindustan Coca-Cola Beverages (HCCB)కి మాతృ సంస్థ. ఈ IPO ద్వారా సుమారు 1 బిలియన్ డాలర్లు (దాదాపు ₹8,300 కోట్లు) సమీకరించాలని, మొత్తం ఎంటర్‌ప్రైజ్ వాల్యుయేషన్‌ను సుమారు 10 బిలియన్ డాలర్లకు (దాదాపు ₹83,000 కోట్లు) చేర్చాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ డీల్ కోసం ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులను ఆహ్వానించింది. Rothschild & Co. వంటి సంస్థలు ఇప్పటికే సలహాదారులుగా ఉన్నాయి. 2025లో Jubilant Bhartia Group ఈ బాట్లింగ్ యూనిట్‌లో 40% వాటాను కొనుగోలు చేసిన తర్వాత ఈ పబ్లిక్ లిస్టింగ్ ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి.
వ్యాపార వ్యూహంలో మార్పు
పెట్టుబడిదారులకు, ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం భారతదేశంలో Coca-Cola యొక్క వ్యాపార నమూనాలో మార్పు. గతంలో, గ్లోబల్ బెవరేజ్ దిగ్గజాలు తమ సొంత క్యాపిటల్-ఇంటెన్సివ్ బాట్లింగ్ నెట్‌వర్క్‌లను నిర్వహించేవి. కానీ ఇప్పుడు, బాట్లింగ్ విభాగాన్ని లిస్ట్ చేయడం ద్వారా, Coca-Cola
