దేశీయ రక్షణ తయారీలో కీలక మైలురాయి:
వాస్తవానికి అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నా, C295 విమానం బయటకు రావడం ఒక కీలక ముందడుగు. 2021 లో జరిగిన ఒప్పందం ప్రకారం, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) భారత్ లోనే 40 C295 విమానాలను తయారు చేయనుంది. మరో 16 విమానాలు మాత్రం Airbus స్పెయిన్ లోని సెవిల్లే ప్లాంట్ నుండి నేరుగా సరఫరా అవుతాయి. ఈ మొత్తం ఒప్పందం విలువ సుమారు ₹21,935 కోట్లు.
స్థానిక అసెంబ్లీ & సామర్థ్యాలు:
ఈ వారం విమానం ఫైనల్ అసెంబ్లీ పూర్తయిందని సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి హాజరుకావచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. దేశీయ రక్షణ తయారీని బలోపేతం చేయడానికి, విదేశీ సరఫరాదారులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఈ ప్రాజెక్ట్ చాలా కీలకం.
ఈ విమానంలో సుమారు 70% కాంపోనెంట్స్ స్థానికంగానే సోర్స్ చేస్తున్నారు. అయితే, Pratt & Whitney ఇంజిన్ల వంటి కొన్ని కీలక భాగాలు మాత్రం ఇంకా దిగుమతి అవుతున్నాయి. C295 అనేది చాలా versatile విమానం. ఇది సైనికులను, సరుకులను తరలించడానికి, మెడికల్ ఎవాక్యుయేషన్ చేయడానికి, నిఘా కార్యకలాపాలకు బాగా ఉపయోగపడుతుంది. చిన్న, సిద్ధంగా లేని ఎయిర్‌స్ట్రిప్‌ల నుండి కూడా దీన్ని ఆపరేట్ చేయవచ్చు.
