దేశీయంగా డిఫెన్స్ టెక్నాలజీని బలోపేతం చేసే దిశగా Sarvam AI కీలక అడుగు వేసింది. భారత త్రివిధ దళాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను అనుసంధానించేందుకు రక్షణ శాఖతో తాజాగా ఒప్పందం చేసుకుంది.
భారత రక్షణ శాఖ, Sarvam AIతో ఒక వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని ద్వారా ఇండియన్ ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ కార్యకలాపాల్లో అత్యాధునిక AI సామర్థ్యాలను తీసుకురావడమే ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా టార్గెట్ అక్విజిషన్, ఆపరేషనల్ నిర్ణయాల్లో వేగం పెంచేందుకు స్వదేశీ టెక్నాలజీని వినియోగించనున్నారు. ఈ మొత్తం ప్రక్రియను 'హెడ్ క్వార్టర్స్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్' పర్యవేక్షించనుంది.
చాణక్య టీమ్ స్పెషాలిటీ
ఈ ప్రాజెక్ట్ కోసం Sarvam AI ప్రత్యేకంగా 'చాణక్య' (Chanakya) అనే విభాగంను ఏర్పాటు చేసింది. ఇది జాతీయ భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, 'Sarvam 105B' ఫౌండేషన్ మోడల్ ఆధారంగా పనిచేస్తుంది. విదేశీ సాఫ్ట్‌వేర్‌పై ఆధారపడటాన్ని తగ్గించి, డేటా భద్రతను మెరుగుపరచడం దీని ప్రధాన ఉద్దేశ్యం.
ఇన్వెస్టర్లకు ఏం అర్థమవుతోంది?
'ఆత్మనిర్భర్ భారత్'లో భాగంగా ప్రభుత్వం రక్షణ రంగంలో ప్రైవేట్ స్టార్టప్ కంపెనీలకు పెద్దపీట వేస్తోంది. ఇది దేశీయ టెక్ కంపెనీలకు పెద్ద అవకాశంగా మారుతోంది. అయితే, మిలిటరీ స్థాయి సైబర్ సెక్యూరిటీని మెయింటెయిన్ చేయడం, వివిధ రకాల హార్డ్‌వేర్‌లతో సాఫ్ట్‌వేర్‌ను సింక్ చేయడం వంటి సవాళ్లు కంపెనీ ముందు ఉన్నాయి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. AI ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకున్నా, ఫైనల్ నిర్ణయం మాత్రం మనుషుల పర్యవేక్షణలోనే (Human-in-the-loop) ఉంటుంది. రాబోయే కాలంలో ఈ ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ నుండి గ్రౌండ్ లెవెల్ డిప్లాయ్‌మెంట్ వరకు ఎంత వేగంగా సాగుతుందనేది మార్కెట్ నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు.
