FY26 లో కంపెనీ పనితీరు
ఆర్థిక సంవత్సరం 2026 (FY26) నాలుగో త్రైమాసికంలో (Q4) Infosys ఆదాయం కాన్స్టంట్ కరెన్సీలో 4.1% పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి (FY26) గాను 3.1% వృద్ధిని నమోదు చేసింది. కంపెనీకి ఇది చాలా ముఖ్యమైన విషయం. FY26 లో $14.9 బిలియన్ల విలువైన పెద్ద డీల్స్ దక్కించుకుంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 28% ఎక్కువ. Q4 లో కూడా $3.2 బిలియన్ల డీల్స్ సాధించింది. FY26 కి గాను అడ్జస్టెడ్ ఆపరేటింగ్ మార్జిన్ 21% ఉండగా, Q4 FY26 కి 20.9% గా నమోదైంది.
FY27 కి జాగ్రత్తామైన అంచనాలు
అయితే, భవిష్యత్తుపై Infosys జాగ్రత్తగా ఉంది. FY27 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వృద్ధి అంచనాలను 1.5% నుండి 3.5% మధ్యకు పరిమితం చేసింది. అదే సమయంలో, ఆపరేటింగ్ మార్జిన్ 20% నుండి 22% మధ్య ఉండొచ్చని అంచనా వేసింది. రెండు అక్విజిషన్స్ (Stratus తో సహా) పూర్తయ్యాయి, వాటిని ఈ గైడెన్స్ లో చేర్చారు. మరికొన్ని ఇంకా రెగ్యులేటరీ అప్రూవల్స్ కోసం వేచి చూస్తున్నాయి. మార్కెట్ లో నెలకొన్న అనిశ్చితులు, తీవ్రమైన పోటీ, మరియు క్లయింట్ల ఖర్చులలో మందగమనం వంటి కారణాలతో ఈ అంచనాలు తగ్గాయని కంపెనీ తెలిపింది.
AI, అక్విజిషన్స్ పై ఫోకస్
భవిష్యత్ వృద్ధికి AI పై పెడుతున్న పెట్టుబడులు, కొనుగోళ్లు కీలకం కానున్నాయి. Infosys తన Topaz Fabric, Cobalt వంటి AI ప్లాట్‌ఫామ్‌లపై నిరంతరం పెట్టుబడులు పెడుతోంది. ఇటీవల $95 మిలియన్లకు యుఎస్-ఆధారిత ఇన్సూరెన్స్ టెక్నాలజీ సంస్థ Stratus ను కొనుగోలు చేయడం ద్వారా హెల్త్‌కేర్, ఇన్సూరెన్స్ రంగాలలో తన సామర్థ్యాలను పెంచుకుంది. AI రంగంలో OpenAI తో కూడా భాగస్వామ్యం కుదుర్చుకుంది.
పోటీదారుల పనితీరు
ఇదే సమయంలో, ఇతర ప్రధాన IT సంస్థల ఫలితాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. TCS FY27 కి 1-4% వృద్ధిని అంచనా వేయగా, HCL Tech FY27 కి 1-4% వృద్ధిని, 17.5-18.5% మార్జిన్లను అంచనా వేసింది. అయితే, Wipro Q4 FY26 లో ఆదాయం తగ్గుముఖం పట్టడంతో జాగ్రత్తామైన అవుట్‌లుక్ ఇచ్చింది.
