అసెట్స్ తో పాటు అప్పులు కూడా!
BEML ల్యాండ్ అసెట్స్ లిమిటెడ్ కు సంబంధించిన సవరించిన ఆడిట్ రిపోర్ట్ సంచలనం రేపుతోంది. కంపెనీ పాలనలో తీవ్రమైన లోపాలు, నిబంధనల ఉల్లంఘనలు బయటపడ్డాయని ఈ రిపోర్ట్ స్పష్టం చేస్తోంది.
రూ. 2.70 కోట్ల వరకు పెనాల్టీలు?
SEBI (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) మార్గదర్శకాలు, కంపెనీల చట్టం (Companies Act) ప్రకారం పాటించాల్సిన నిబంధనలను కంపెనీ పాటించలేదని ఆడిటర్లు తేల్చారు. దీని వల్ల కంపెనీకి ₹2.70 కోట్ల వరకు పెనాల్టీలు విధించే అవకాశం ఉంది. ముఖ్యంగా, కంపెనీ బోర్డులో మహిళా ఇండిపెండెంట్ డైరెక్టర్ లేకపోవడం, ఆడిట్ కమిటీ, నామినేషన్ & రెమ్యూనరేషన్ కమిటీ వంటి తప్పనిసరి కమిటీలు ఏర్పాటు చేయకపోవడం వంటివి తీవ్రమైన పాలనా లోపాలుగా పరిగణిస్తున్నారు.
ఆస్తులపై రిజిస్టర్ కాని ఒప్పందాల రిస్క్
ఇప్పటికే పాలనా లోపాలు, పెనాల్టీల భయంతో ఉన్న కంపెనీకి, ఆస్తులకు సంబంధించిన రిజిస్టర్ కాని ఒప్పందాల వల్ల అదనపు రిస్క్ కూడా పొంచి ఉందని రిపోర్ట్ హెచ్చరిస్తోంది.
