వారసత్వ పుకార్లకు Biocon చెక్!
Biocon లిమిటెడ్ తమ నాయకత్వ మార్పులకు సంబంధించిన మీడియా వార్తలను ఖండిస్తూ, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) మరియు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) లకు అధికారికంగా స్పష్టత ఇచ్చింది. కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్-షా తన పదవిలోనే కొనసాగుతారని, ఎటువంటి తక్షణ నాయకత్వ లేదా యాజమాన్య మార్పులు ఉండబోవని Biocon స్పష్టం చేసింది.
ఇటీవల కొన్ని వార్తా సంస్థలు, ఫౌండర్ కిరణ్ మజుందార్-షా తన మేనకోడలు, Bicara Therapeutics CEO క్లైర్ మజుందార్‌ను ఐదేళ్ల ప్రణాళిక ప్రకారం కంపెనీకి వారసురాలిగా ఎంపిక చేశారని కథనాలను ప్రచురించాయి. ఈ వార్తల నేపథ్యంలో మార్కెట్లో ఊహాగానాలు వెలువడ్డాయి.
అయితే, ఈ వార్తలను Biocon పూర్తిగా తోసిపుచ్చింది. తమ పాలన, కార్యాచరణ వ్యూహంలో ఎలాంటి మార్పులు ఉండవని, పెట్టుబడిదారులకు పూర్తి భరోసా ఇవ్వడానికే ఈ ప్రకటన జారీ చేసినట్లు కంపెనీ తెలిపింది. వెల్లడించాల్సిన తక్షణ నాయకత్వ లేదా యాజమాన్య మార్పులేవీ ప్రస్తుతం ప్రణాళికలో లేవని Biocon స్పష్టం చేసింది.
