Ravindra Energy: భారీ శుభవార్త
Ravindra Energy కంపెనీ ప్రమోటర్, Khandepar Investments Private Limited (KIPL), తమ వద్ద ఉన్న 55,00,000 ఈక్విటీ షేర్లపై విధించిన ప్లెడ్జ్ ను అధికారికంగా ఎత్తివేసింది. ఈ షేర్ల మొత్తం విలువ సుమారు ₹68.37 కోట్లు.
ఎందుకీ నిర్ణయం?
KIPL తమ రుణ బాధ్యతలను తీర్చుకున్న నేపథ్యంలోనే ఈ ప్లెడ్జ్ తొలగింపు జరిగినట్లు తెలుస్తోంది. దీనివల్ల, ప్రమోటర్ల పరంగా కంపెనీపై ఒత్తిడి తగ్గి, అమ్మకాల ప్రమాదం (Selling Risk) కూడా తగ్గినట్టే. ఇది కంపెనీ పాలనకు (Governance) మంచి సంకేతంగా భావిస్తున్నారు. అయితే, ప్రమోటర్ల షేర్ హోల్డింగ్ (Promoter Shareholding) మాత్రం మారలేదని సమాచారం. ప్రస్తుతం ఇది 32.29% గానే ఉంది.
